హనుమకొండలో భూసేకరణ పనులపై కలెక్టర్ సమీక్ష

కలం, వరంగల్ బ్యూరో :  హనుమకొండ (Hanumakonda) జిల్లా కలెక్టరేట్‌లో గౌరవెల్లి, దేవాదుల, గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే, ఆర్వోబీ ప్రాజెక్టుల భూసేకరణపై జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్ పాయ్ (Collector Chahat Bajpai) సమీక్ష నిర్వహించారు. భూసేకరణలో స్పష్టమైన పురోగతి సాధించాలని అధికారులను ఆదేశించారు. శనివారం మినీ కాన్ఫరెన్స్ హాలులో అదనపు కలెక్టర్ ఎన్. రవితో కలిసి నిర్వహించిన సమావేశంలో వివిధ ప్రాజెక్టుల పనుల పురోగతి, పరిహారం చెల్లింపులు, భూభారతి దరఖాస్తులు, మీసేవ సర్టిఫికెట్ల జారీ అంశాలపై సమీక్ష చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ (Collector Chahat Bajpai) మాట్లాడుతూ, ఆర్వోబీ భూసేకరణలో పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు. పెగ్ మార్కింగ్ వంటి కీలక పనుల్లో క్షేత్రస్థాయిలో వేగం పెరగాలని సూచించారు. ప్రతి శాఖ నిర్దేశిత లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని ఆదేశించారు. వచ్చే శనివారానికి పురోగతి నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణ, పరిహారం చెల్లింపులలో జాప్యం లేకుండా ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలని సూచించారు. అదనపు కలెక్టర్ ఆర్డీవోలు, తహసీల్దార్లతో భూభారతి దరఖాస్తులు, మీసేవ సేవలపై సమీక్ష నిర్వహించి, ప్రజా సేవలను మరింత వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బి, దేవాదుల, గౌరవెల్లి ప్రాజెక్ట్ అధికారులు, భూసేకరణ విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read Also: ఇండియాను మోదీ అమ్మేశారు: రాహుల్ గాంధీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>