Mobile Popup Ad
Mobile Popup Ad

సివిల్స్‌లో ర్యాంక్ రానివారికి.. మోడీ మోరల్ సపోర్ట్

కలం, వెబ్ డెస్క్: సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిన అభ్యర్థులు నిరుత్సాహపడవద్దని ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi )సూచించారు. ఈ పరీక్షలో విజయాన్ని అందుకోలేకపోయిన వారికి ఇది కఠినమైన సమయం కావొచ్చని తాను అర్థం చేసుకుంటున్నానని తెలిపారు. అయితే ఇది జీవిత ప్రయాణంలో ఒక చిన్న దశ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.

ముందు ఇంకా ఎన్నో అవకాశాలు ఉన్నాయని, భవిష్యత్తులో జరిగే పరీక్షల్లోనూ అభ్యర్థులు తమ ప్రతిభను చాటుకునే అవకాశం ఉందని చెప్పారు. అలాగే దేశానికి సేవ చేసే అనేక మార్గాలు ఉన్నాయని ప్రధాని తెలిపారు. ముందున్న ప్రయాణంలో విజయాలు సాధించాలని ఆయన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>