కలం, వెబ్‌డెస్క్: దేశంలో 80వ స్వాంతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ ప్రధాని మోదీ (PM Modi) , కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) తీరు హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీలో జరిగిన వేడుకల్లో మోదీ, హైదరాబాద్‌లో జరిగిన సంబరాల్లో బండి సంజయ్ పాల్గొన్నారు. వీరిద్దరూ భారత్ జాతీయ జెండా (Indian National Flag) ను అవమానించారంటూ రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దేశ భక్తులం అని చెప్పుకునే బీజేపీ నేతలకు ఇది కనిపించడం లేదా అని నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన వేడుకల్లో ప్రధాని మోదీ ధరించిన జాకెట్‌పై జేబు పాకెట్ స్క్వేర్‌గా జాతీయ జెండాను ధరించారు. అయితే ఇందులో జెండాను నిలువుగా ధరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిలువుగా ధరించడం వల్ల అది కాస్తా ఐర్లాండ్ జాతీయ జెండాలా దర్శనమిచ్చింది. దీంతో నెటిజన్లు మోదీ తీరుపై మండిపడుతున్నారు. మోదీ ఐర్లాండ్ జెండాతో భారత స్వాతంత్య్ర వేడుకలకు హాజరయ్యారని సెటైర్లు వేస్తున్నారు. గతంలో కూడా ఇలాగే మోదీ జాతీయ జెండాను అవమానించారని గుర్తు చేస్తున్నారు. 2016లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో జాతీయ జెండాతో ముఖం తుడుచుకోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాట్నాలోని ముజాఫర్పూర్లో మోదీపై కేసు నమోదైంది.
ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ నేడు బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన తిరంగా యాత్రలో పాల్గొన్నారు. వందలాది మంది విద్యార్థులు, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్న ఈ ర్యాలీలో బండి సంజయ్ జాతీయ జెండాతో ముఖంపై చెమట తుడుచుకోవడం విమర్శలకు దారి తీసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సభల్లో దేశం, ధర్మం అంటూ ఎన్నో గొప్పలు చెప్పే వాళ్లు కూడా ఇలా జాతీయ జెండాకు కనీస గౌరవం ఇవ్వకుండా వ్యవహరించడం ఏమిటని నెటిజన్లు మండిపడుతున్నారు.
కేంద్ర మంత్రి.. జాతీయ జెండాకు అవమానం?
-జాతీయ జెండాతో మొహం తుడుచుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్
-నెట్టింట వైరల్‌గా మారిన వీడియో.. బండి సంజయ్ పై విమర్శలు
Video of Union Minister Bandi Sanjay Allegedly Wiping Face with National Flag Sparks Criticism#BandiSanjay #BJP… pic.twitter.com/vqJstri12v— Kalam Daily (@kalamtelugu) August 15, 2026

