కలం, వెబ్ డెస్క్: విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ (PM Modi) ఫ్రాన్స్ చేరుకున్నారు. అధ్యక్షుడు మెక్రాన్ ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్లిన ప్రధానికి నైస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. 13, 14వ తేదీల్లో నైస్, 16, 17, 18వ తేదీల్లో ఎవైన్, పారిస్ నగరాల్లో పర్యటించబోతున్నారు. 14వ తేదీన మెక్రాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు. అలాగే, ఇరువురు కలిసి భారత్ ఇన్నోవేటివ్ ఈవెంటులో పాల్గొంటారు. ఇక ఇదే సమయంలో జీ 7 దేశాల సదస్సుల కోసం ఫ్రాన్స్ పర్యటనకు రాబోతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఈ నెల 17న ప్రధాని మోదీ భేటీ అవుతారని వైట్ హౌస్ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య జరిగే చర్చలపై ఆసక్తి నెలకొంది.

