అదరగొట్టిన ఎస్‌ఆర్‌హెచ్.. చెన్నై టార్గెట్ 195

క‌లం, వెబ్ డెస్క్‌: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఎస్‌ఆర్‌హెచ్ (SRH) మరోసారి అదరగొట్టింది. అభిషేక్, క్లాసెన్ ఇద్దరూ 59 పరుగులతో జట్టుకు ఊపిరూదారు. మిగిలిన బ్యాటర్లు పేలవమైన ప్రదర్శనతో వెనుదిరిగారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లకు సన్‌రైజర్స్ 9 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. యువ సంచలనం అభిషేక్ శర్మ (59) కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది, ఐపీఎల్ 2026లో అత్యంత వేగవంతమైన అర్ధశతకాన్ని నమోదు చేసి రికార్డు సృష్టించాడు.

ఆరంభంలోనే ట్రావిస్ హెడ్ (23), కెప్టెన్ ఇషాన్ కిషన్ (0) పెవిలియన్ చేరినా, మ్యాడ్ మ్యాక్స్ హెన్రిచ్ క్లాసెన్ (59) తన మార్క్ ఇన్నింగ్స్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మధ్యలో నితీష్ కుమార్ రెడ్డి, శివాంగ్ కుమార్ మెరుపులు మెరిపించడంతో ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. డెత్ ఓవర్లలో అన్షుల్ కాంబోజ్, జేమీ ఓవర్టన్ చెలరేగి వికెట్లు తీయడంతో హైదరాబాద్ స్కోరు 200 దాటలేదు. ఇప్పుడు చెన్నై (CSK) గెలవాలంటే 120 బంతుల్లో 195 పరుగులు చేయాల్సి ఉంది.

Read Also: ఇన్‌ఫ్లూయెన్స‌ర్ చేతికి సీఎం రేవంత్ ఐపీఎల్ టికెట్స్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>