ఏజెన్సీ సమస్యలపై మంత్రి సీతక్కకు పినపాక ఎమ్మెల్యే వినతి

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోనీ మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పినపాక (Pinapaka) ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు (MLA Payam Venkateswarlu) మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం సచివాలయంలో సీతక్క ను కలిసి వినతి పత్రం అందచేశారు. Pinapaka నియోజకవర్గంలోని ఏడు మండలాల పరిధిలో నెలకొన్న సమస్యలు, మారుమూల ఏజెన్సీ గ్రామాలకు రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు పంచాయతీరాజ్ పరిధిలోని ప్రధాన, అంతర్గత (బీటీ) రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరుచేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. అలాగే కనెక్టివిటీ లేని ప్రాంతాల్లో హైలెవల్ బ్రిడ్జిల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని విన్నవించారు.

మహిళా, శిశు సంక్షేమంలో భాగంగా, నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో పక్కా భవనాలు లేక అద్దె భవనాల్లో కొనసాగుతున్న సుమారు 173 అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వ స్థలాలను కేటాయించి, శాశ్వత భవనాలను నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని పాయం (MLA Payam Venkateswarlu) కోరారు. నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని అలాగే అంగన్‌వాడీ టీచర్ల వేతనాలను పెంచడంతో పాటు, వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని సీతక్క దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అందజేసిన వినతులపై మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, నియోజకవర్గంలోని రోడ్లు, బ్రిడ్జిలు, అంగన్‌వాడీ భవనాల సమస్యలతో పాటు, అంగన్‌వాడీ టీచర్ల సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>