మణుగూరులో పేదలకు ప్రభుత్వ సంక్షేమ భరోసా

కలం, ఖమ్మం బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని పినపాక ఎమ్మెల్యే(Pinapaka MLA) పాయం వెంకటేశ్వర్లు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు అంబేద్కర్‌ సెంటర్‌లో(Ambedkar Center) గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 14 గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులు, 33 మందికి కళ్యాణలక్ష్మి–షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పేదలందరికీ నిత్యావసరాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు  సులభంగా అందేలా స్మార్ట్‌ రేషన్‌ కార్డులు అందిస్తున్నట్లు తెలిపారు. ఆడబిడ్డల వివాహాలకు కళ్యాణలక్ష్మి–షాదీముబారక్‌ పథకాలు కొండంత భరోసాగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని  ప్రతి అర్హులైన కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>