ఇంజినీరింగ్ కాలేజీలకు TAFRC వార్నింగ్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలోని అన్ని ఇంజినీరింగ్ కళాశాలలకు ఫీజుల నియంత్రణ కమిటీ (TAFRC) కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుకు మించి విద్యార్థుల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ అదనపు రుసుములు వసూలు చేయరాదని నోటీసులు పంపించింది. నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే సంబంధిత కళాశాలలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని TAFRC హెచ్చరించింది.

ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు నిర్మాణాన్ని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపే విధంగా వ్యవహరించవద్దని తేల్చి చెప్పింది.

TAFRC ప్రధాన బాధ్యతలివే..

  • ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీల ట్యూషన్ ఫీజులను నిర్ణయించడం
  • కాలేజీలు సమర్పించే ఆర్థిక వివరాలను పరిశీలించడం
  • క్యాపిటేషన్ ఫీజు (డొనేషన్) వంటి అక్రమ వసూళ్లను నిరోధించే విధంగా ఫీజు నిర్మాణాన్ని పర్యవేక్షించడం
  • విద్యార్థులు, విద్యాసంస్థల ప్రయోజనాలను సమతుల్యం చేసే విధంగా ఫీజులను ఖరారు చేయడం

Read Also: డ్రంకెన్ డ్రైవ్ స్కామ్.. నలుగురు పోలీసుల సస్పెన్షన్ !

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>