కలం, వెబ్ డెస్క్ : బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర లక్షా 46వేలకు పైగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర లక్షా 34వేలకు పైగా ఉంది. కాబట్టి తులం బంగారం ఒకేసారి కొనడం చాలా మందికి ఇబ్బందిగానే ఉంటుంది. ఇలాంటి వారికి ఫోన్ పే (Phonepe) కొత్త ఆఫర్ స్కీమ్ ను తీసుకొచ్చింది. రీసెంట్ గా టాటా గ్రూప్ నకు చెందిన క్యారట్ లేన్ జువెలరీ సంస్థతో ఫోన్ పే కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా గోల్డ్ సేవింగ్ స్కీమ్ ను తీసుకొచ్చింది ఫోన్ పే. కచ్చితంగా గోల్డ్ కొనాలి అనుకునేవారే ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టాలి. ఫోన్ పే ద్వారా ఈ స్కీమ్ లో 9 నెలల పాటు నెలవారీగా కొంత మొత్తం పెట్టుబడి పెడితే.. పదో నెల వాయిదాను మీకు ఫోన్ పే (Phonepe) సంస్థనే యాడ్ చేస్తుంది.
ఉదాహరణకు మీరు నెలకు 10వేల చొప్పున 9 నెలల పాటు ఫోన్ పే గోల్డ్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే.. 90వేలు అవుతుంది. 10వ నెల వాయిదా రూ.10వేలను ఫోన్ పే మీ గోల్డ్ స్కీమ్ ఖాతాలో జమ చేస్తుంది. అప్పుడు మీ నిల్వ మొత్తం లక్ష రూపాయలకు చేరుతుంది. ఈ లక్ష రూపాయలకు సరిపడా బంగారాన్ని మీకు క్యారట్ లేన్ సంస్థ అందిస్తుంది. కాకపోతే ఈ డబ్బులు మీకు నగదు రూపంలో అస్సలు ఇవ్వరు. ఈ డబ్బులతో మీరు బంగారం మాత్రమే కొనాలి. ప్రతి నెల వాయిదా కచ్చితంగా కట్టాల్సిందే. కాబట్టి ఈ స్కీమ్ లో జాయిన్ అయ్యే ముందే ఫోన్ పే సంస్థ ప్రతినిధులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకోవాలి.


