కలం, వెబ్‌డెస్క్: నగరంలోని వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న 137 ఓపెన్ ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని (Rajiv Swagruha Plots Auction) తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా తొర్రూర్, కుర్మల్‌గూడ, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని బహదూర్‌పల్లి ప్రాంతాల్లో ఇప్పటికే అభివృద్ధి చెంది, మౌలిక వసతులతో ఉన్న ప్లాట్లకు ఫిబ్రవరి 7, 8 తేదీల్లో బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఎండీ వి.పి.గౌతమ్ వెల్లడించారు. ఆయా ప్రాంతాలను బట్టి బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరల్లోనే ఈ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
తమ ఆకాంక్షలు, అభిరుచులకు అనుగుణంగా సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్న వారికి ఈ ప్లాట్లు చాలా అనుకూలంగా ఉంటాయని గౌతమ్ తెలిపారు. మంచి కనెక్టివిటీ, వివాదాలు లేని క్లియర్ టైటిల్‌తోపాటు ప్రభుత్వ యంత్రాంగమే ఈ లేఔట్లను అభివృద్ధి చేయడం, కొన్న వెంటనే నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా ఈ ప్లాట్లు (plots) ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ ప్రాంతాల్లోని ప్లాట్ల కొనుగోలుకు గతంలో భారీగా స్పందన రావడంతో మరోసారి ప్లాట్లను వేలం ద్వారా విక్రయిస్తున్నామని (Rajiv Swagruha Plots Auction) ఆయన తెలిపారు. ఆసక్తి ఉన్నవాళ్లు నిర్ణీత డిపాజిట్‌ను (EMD) మీ-సేవ కేంద్రాల్లో ఆన్లైన్/యూపీఐతోపాటు డీడీ ద్వారా కూడా చెల్లించవచ్చన్నారు.
ఓఆర్ఆర్-ఆదిభట్ల, ఐటీ కారిడార్‌కు సమీపంలోని తొర్రూర్ లేఔట్‌లోని ప్లాట్లకు ఫిబ్రవరి 7, 8 తేదీల్లో; ఓఆర్ఆర్ సమీపంలోని బహదూర్‌పల్లి, శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు దగ్గరలోని కుర్మల్‌గూడలోని ప్లాట్లకు ఫిబ్రవరి 8వ తేదీ మధ్యాహ్నం బహిరంగ వేలం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు www.swagruha.telangana.gov.in వెబ్సైట్లో చూడవచ్చని వివరించారు. అలాగే ఫోన్ నెంబర్లు 8121022230 (తొర్రూర్), 8347472106 (బహదూర్‌పల్లి),7993455802 (కుర్మల్‌గూడ)లోనూ సంప్రదించవచ్చన్నారు.
ప్లాట్లు.. విస్తీర్ణం.. కనీస ధర
- తొర్రూరు: ప్లాట్లు 105; విస్తీర్ణం 200–500 చ.గ. ; కనీస ధర చదరపు గజానికి రూ.25 వేలు.
- బహదూర్‌పల్లి: ప్లాట్లు 12; విస్తీర్ణం 200-1000 చ.గ.; ఈ లేఔట్లో కార్నర్ ప్లాట్‌కు కనీస ధర చదరపు గజానికి రూ.30వేలు. ఇతర ప్లాట్లకు రూ.27 వేలు.
- కుర్మల్‌గూడ: ప్లాట్లు 20 ; విస్తీర్ణం 200-300 చ.గ.; కనీస ధర చదరపు గజానికి రూ.20 వేలు.
ధరావతు.. ఆఖరు తేదీ
- తొర్రూర్ ప్లాట్ల కొనుగోలుకు రూ.2లక్షల ధరావతుతో ఫిబ్రవరి 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
- బహదూర్‌పల్లిలోని ప్లాట్లకు రూ.3లక్షలు, కుర్మల్‌గూడలోని ప్లాట్లకు రూ.2లక్షల ధరావతుతో ఫిబ్రవరి 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.


