Mobile Popup Ad
Mobile Popup Ad

అక్క‌డ పెట్రోల్ బంకులు మూత‌ప‌డుతున్నాయ్‌..!

క‌లం, వెబ్ డెస్క్‌: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్త‌త‌ల‌తో తెలుగు రాష్ట్రాల‌ను గ్యాస్ కష్టాలు కుదిపేస్తుంటే ఇప్పుడు మ‌రో పెద్ద సమ‌స్య స్వాగ‌తం ప‌లుకుతోంది. ప‌లుచోట్ల పెట్రోల్ కొర‌త (Petrol Shortage) వేధిస్తుండటం ఆందోళ‌న క‌లిగిస్తోంది. కొన్ని బంకులు మూత‌ప‌డుతుండ‌గా, మ‌రికొన్ని చోట్ల వాహ‌న‌దారులు ముందుగానే భ‌యంతో ఫుల్ ట్యాంకులు చేయించుకుంటున్నారు. తాజాగా కాకినాడ (Kakinada) జిల్లా పిఠాపురంలో ఇలాంటి ఘ‌ట‌న‌లే చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్ర‌భావంతో దేశీయంగా పెట్రోల్ నిల్వ‌లు తగ్గినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో పెట్రోల్ మొత్తం అయిపోతే ఎలా? అన్న‌ భయంతో వాహ‌న‌దారులు ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు.

మ‌రోవైపు శనివారం అర్ధరాత్రి నుంచే స్థానికంగా కొన్ని పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. పెట్రోల్ నిల్వ‌లు రాకపోవడంతో యాజ‌మాన్యాలు నో స్టాక్ బోర్డులు పెడుతున్నాయి. దీనంత‌టికి చమురు కంపెనీల నుండి ట్యాంకర్ల సరఫరా తగ్గడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. మ‌రి రానున్న రోజుల్లో పెట్రోల్ క‌ష్టాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

Read Also: ఇళ్ల‌కు వెళ్లిపోండి.. బాస‌ర IIIT విద్యార్థుల‌కు యాజ‌మాన్యం ఆదేశాలు!

Follow Us On: Sharechat

 

 

 

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>