Mobile Popup Ad
Mobile Popup Ad

సాయికృష్ణ కేసును సీబీఐకి అప్పగించాలి: పేర్ని నాని

కలం, వెబ్ డెస్క్ : ఏపీలో సంచలనంగా మారిన సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) ఆరోపించారు. సాయికృష్ణ మిస్సింగ్ అయి 40 రోజులైన పోలీసుల దాష్టీకాలపై ప్రభుత్వం చర్యలేవని నిలదీశారు. వెంటనే సాయికృష్ణ కేసును సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై అనేక అనుమానాలున్నాయని, అసలు అతడు బతికున్నాడో? చనిపోయాడో? ఇప్పటికీ చెప్పలేదని చెప్పారు. మార్కాపురం నుంచి విజయవాడ కృష్ణలంక తీసుకెళ్లిన తర్వాత సాయికృష్ణను ఏం చేశారని ప్రశ్నించిన పేర్ని నాని.. విజయవాడ సీపీ ఆదేశాలతోనే ఇదంతా జరిగిందనే సందేహాలున్నాయన్నారు. సాయికృష్ణ మిస్సింగ్ పై అతని తల్లి విజయలక్ష్మికి సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారని, అయిన కూడా ఈ కేసులో పురోగతి కనిపించడం లేదని విమర్శలు గుప్పించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>