కలం, వెబ్ డెస్క్: సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘పెద్ది’ (Peddi) మూవీ జూన్ 4వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్–జాన్వీ కపూర్ (Ram Charan – Janhvi Kapoor) జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ పూర్తయి, ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేశారు. 3 గంటల 2 నిమిషాల నిడివితో థియేటర్లలోకి రాబోతున్న ఈ రూరల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ గురించి.. ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. సినిమా అదుర్స్.. అంటూ సెన్సార్ సభ్యుల నుంచి ఫీడ్ బ్యాక్ అందుతుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరుగుతోంది.
మూడు ఆటల కలయిక..
ట్రైలర్‌లో చూపించినట్లుగా ఇది క్రికెట్, కుస్తీ ఆటలే కాదు.. పరుగు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి ఆటను బలమైన భావోద్వేగాలతో ముడిపెట్టి.. బుచ్చిబాబు అద్భుతంగా తెరకెక్కించారట. మరీ ముఖ్యంగా మూవీ (Peddi) చివరి 20 నిమిషాల్లో రామ్ చరణ్ నట విశ్వరూపం చూస్తారని చెబుతున్నారు. కథకు తగ్గట్లు ఏ.ఆర్.రెహమాన్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చక్కగా కుదిరాయని విశ్లేషిస్తున్నారు. జూన్ 4వ తేదీన విడుదలవుతున్నప్పటికీ, ఒక రోజు ముందే ప్రీమియర్స్ హంగామా నెలకొనుంది.
Read Also: రూపాయి ఖర్చు లేకుండా.. సబ్జా గింజలతో పార్లర్ లాంటి గ్లో!
Follow Us On: WhatsApp

