కలం, కరీంనగర్ బ్యూరో: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ (Gaddam Vamsi Krishna) ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు. సోమవారం గోదావరిఖని (Godavarikhani) బస్టాండ్ వెలుపల పర్యటించి స్థానికులతో ఆత్మీయంగా ముచ్చటించారు.
ఈ సందర్భంగా వారితో కలిసి టీ తాగుతూ ప్రజలతో కలిసిపోయారు. వారి సమస్యలు, స్థానిక పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల అభిప్రాయాలను ఓపికగా వింటూ, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునే ప్రయత్నం చేశారు. వారికి ఏమైనా సమస్యలు ఉంటే తక్షణమే వాటి నివారించేందుకు కృషి చేస్తానని మాట ఇచ్చారు.

