ఇందూరు నుంచి శబరిమలకు.. 40 మంది స్వాముల మహా పాదయాత్ర

కలం, నిజామాబాద్ బ్యూరో: శబరిమలకు పాదయాత్ర (Sabarimala Padayatra) గా వెళ్లడం అనేది దైవ నిర్ణయం అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. ఇందూరు శ్రీధర్మశాస్త్ర పాదయాత్రను సోమవారం నగరంలోని అయ్యప్ప ఆలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహా పాదయాత్రలో పాల్గొంటున్న స్వాములందరికి ఎటువంటి ఆటంకాలు కలుగకుండా విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

మొత్తం 40 మంది స్వాములు సుమారు 45 రోజులపాటు పాదయాత్రగా శబరిమల చేరుకుంటారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలన్నారు. అయ్యప్ప మాల ఎంతో పవిత్రమైందని, మాలాధారనతో పాదయాత్రగా వెళ్లడమనేది మరింత కఠినమైందని అన్నారు. కార్యక్రమంలో రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, గుండయ్య గురుస్వామి, ఆగమయ్య గురుస్వామి, పాదయాత్ర స్వాములు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>