కామారెడ్డి కలెక్టర్ పేరుతో ఫేక్ సోషల్ మీడియా ఐడీలు.. కేసు నమోదు!

కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి జిల్లా కలెక్టర్ (Kamareddy Collector) పేరుతో నకిలీ సోషల్ మీడియా ఐడీలను సృష్టించి వైరల్ చేస్తున్న నిందితులపై సైబర్ నేరం కింద కేసు నమోదైంది. జిల్లా కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ అహ్మద్ హుస్సేన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. కామారెడ్డి పరిధిలోని దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది.

గుర్తుతెలియని వ్యక్తులు వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్‌లలో కలెక్టర్ పేరుతో నకిలీ ఐడీలను క్రియేట్ చేసి ప్రచారం చేస్తున్నారు. ఈ సైబర్ నేరంపై కేసు నమోదు చేసి, నిందితులను పట్టుకోవడానికి దర్యాప్తు జరుపుతున్నట్లు దేవునిపల్లి ఎస్ఐ బాల్ రెడ్డి తెలిపారు. ఇలాంటి ఫేక్ ఐడీల ద్వారా వచ్చే సందేశాల పట్ల, డబ్బులు లేదా ఇతర సహాయం కోరితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>