‘మహా’ సీఎంతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్: మహారాష్ట్రలోని ముంబైలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోమవారం భేటీ అయ్యారు. తెలంగాణలో తుమ్మడిహట్టి వద్ద కొత్తగా నిర్మించ తలపెట్టిన బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్ర ప్రభుత్వ బృందంతో రేవంత్ సర్కార్ బృందం చర్చిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ ను సస్యశ్యామలం చేసేందుకు ఈ ప్రాజెక్ట్ ను 152 మీటర్ల ఎత్తుతో నిర్మించాలని తలపెట్టింది. ఇందుకు మహారాష్ట్ర సర్కార్ ను ఒప్పించేందుకు రేవంత్ బృందం ఫడ్నవీస్ బృందంతో చర్చలు జరుపుతోంది.

అయితే మహారాష్ట్ర సర్కార్ మాత్రం తుమ్మిడిహట్టి బ్యారేజీ 148 మీటర్లు మించొద్దని అభ్యంతరం తెలిపింది. ఈ విషయంపై పలు ప్రతిపాదనలు సిద్ధం చేసిన తెలంగాణ నీటిపారుదల శాఖ బృందం మహారాష్ట్రతో సానుకూల చర్చలు జరిపి 152 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్ట్ నిర్మాణం దిశగా ఒప్పించేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇక సీఎం రేవంత్ చర్చలు ఫలిస్తాయా? రేవంత్ ప్రతిపాదనలకు ‘మహా’ సర్కార్ ఒప్పుకుంటుందా? అనేది ఉత్కంఠగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>