కలం, స్పోర్ట్స్: ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన 24వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై (PBKS vs MI) ఏడు వికెట్ల తేడాతో పంజాబ్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఐపీఎల్‌లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి పంజాబ్ బౌలర్‌గా చరిత్ర సృష్టించగా, పలు ఇతర రికార్డులు కూడా నమోదయ్యాయి.
ఇంకా ఏవేవి రికార్డులు నమోదయ్యాయంటే..
క్వింటన్ డికాక్ మెరుపులు: ముంబై ఇండియన్స్ తరపున రెండవ అత్యధిక వ్యక్తిగత స్కోరు (112 నాటౌట్) నమోదు చేశాడు.
సెంచరీల వీరుడు: టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు (9) చేసిన జాబితాలో డికాక్ సంయుక్తంగా నాలుగో స్థానానికి చేరుకున్నాడు. అలాగే మూడు వేర్వేరు ఐపీఎల్ ఫ్రాంచైజీల తరపున సెంచరీలు చేసిన మూడవ ఆటగాడిగా నిలిచాడు.
భారీ భాగస్వామ్యం: పంజాబ్‌పై ముంబై తరపున డికాక్, నమన్ ధీర్ నమోదు చేసిన 122 పరుగుల జంట.. రెండో అత్యధిక భాగస్వామ్యంగా నిలిచింది.
వికెట్ కీపర్‌గా రికార్డు: ఐపీఎల్‌లో వికెట్ కీపర్‌గా అత్యధిక సార్లు (25 సార్లు) 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన వారిలో డికాక్ రెండో స్థానంలో ఉన్నాడు.
ముంబైపై (Mumbai Indians) పంజాబ్ ఆధిపత్యం: ఐపీఎల్ చరిత్రలో ముంబైపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా పంజాబ్ కింగ్స్ (18 విజయాలు) నిలిచింది. వాంఖడే స్టేడియంలోనూ ముంబైపై అత్యధిక విజయాలు (6) పంజాబ్ పేరిటే ఉన్నాయి.
హార్దిక్ పాండ్యా: ఐపీఎల్‌లో 150 సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు.
జస్ప్రీత్ బుమ్రా: తన 150వ ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు.
ప్రభ్‌సిమ్రాన్ సింగ్: ఐపీఎల్‌లో 150 ఫోర్లు పూర్తి చేశాడు.
శ్రేయస్ అయ్యర్: టీ20 క్రికెట్‌లో 300 సిక్సర్లు బాదిన మైలురాయిని చేరుకున్నాడు.
కూపర్ కానోలీ: టీ20 ఫార్మాట్‌లో 1000 పరుగులు పూర్తి చేశాడు.
మార్కస్ స్టోయినిస్: టీ20 క్రికెట్‌లో 600 ఫోర్లు కొట్టిన రికార్డు నమోదు చేశాడు.

