కీలక బిల్లులపై ‘ఇండియా’ వ్యూహం ఫిక్స్

కలం, నేషనల్ డెస్క్: మహిళా రిజర్వేషన్ బిల్లు సహా డీలిమిటేషన్ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లోక్‌సభ స్థానాల సంఖ్య పెంపుపై కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులపై ప్రతిపక్ష పార్టీలు అనుసరించాల్సిన వ్యూహంపై ఇండియా కూటమి కీలక సమావేశం (INDIA Bloc Meeting) నిర్వహించింది. ఏఐసీసీ నేత మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన రాజ్యసభలోని ఆయన ఛాంబర్‌లో శుక్రవారం ఉదయం జరిగిన సమావేశంలో యాక్షన్ ప్లాన్ గురించి చర్చించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఇప్పటికే కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ సంపూర్ణంగా స్వాగతించిన నేపథ్యంలో డీలిమిటేషన్ బిల్లుపై అనుసరించాల్సిన వైఖరి గురించి అన్ని పార్టీల అభిప్రాయాలను ఈ సమావేశంలో ఖర్గే స్వీకరించారు. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఈ బిల్లుల ఆమోదం కోసం లోక్‌సభలో ఓటింగ్ జరగనున్నందున డీలిమిటేషన్ బిల్లుపై ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి, ఓటింగ్‌లో ఎలా వ్యవహరించాలి.. తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.

లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఈ బిల్లులపై లోక్‌సభలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత ఓటింగ్ జరగనున్నది. కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందని, ఇది శాశ్వత నష్టంగా మారుతుందని ఐదు రాష్ట్రాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లు ప్రతులను డీఎంకే అధినేత స్టాలిన్ చెన్నై నగరంలో గురువారం దగ్దం చేసిన నిరసన తెలిపారు. ఆ పార్టీకి చెందిన ఎంపీలంతా ఉభయ సభలకు నల్ల దుస్తులతో వచ్చి నిరసన తెలిపారు. ఇప్పుడున్న స్థానాల్లోనే మహిలలకు 33% రిజర్వేషన్ కల్పించాలని, గతంలో వాజ్‌పాయి అనుసరించిన విధంగానే ఇప్పుడు కూడా రాబోయే పాతికేండ్ల వరకు లోక్‌సభ సీట్ల సంఖ్య పెంచవద్దని తాజాగా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. విపక్షాలన్నీ డీలిమిటేషన్ బిల్లును పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తున్నందున సాయంత్రం జరగబోయే ఓటింగ్ కీలకంగా మారింది.

ఈ బిల్లుల్లో రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లు కూడా ఉండడంతో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. మొత్తం 543 మంది సభ్యులున్న లోక్‌ సభలో ప్రస్తుత, రెండు ఖాళీలు ఉన్నాయి. మిగిలిన 541 మందిలో కనీసంగా 360 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తేనే 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం లభిస్తుంది. కానీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు ఆ స్థాయిలో బలం లేనందున కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీల మద్దతు తప్పనిసరి. ఈ కారణంగానే ఓటింగ్ ప్రక్రియకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>