Mobile Popup Ad
Mobile Popup Ad

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’రివ్యూ&రేటింగ్

క‌లం, వెబ్ డెస్క్‌: ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)- హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh)పై సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా తమిళ హీరో విజయ్ ‘తేరి’ (తెలుగులో పోలీసోడు) రీమేక్ అని గాసిప్స్ వినబడ్డాయి. ఈ సినిమా రీమేక్ కాదు బాబోయ్ అని ఎన్నిసార్లు హరీష్ శంకర్ చెప్పినా కూడా ఆ గాసిప్స్ బెడద వదల్లేదు. దీంతో వాటికి థియేటర్లలోనే క్లారిటీ ఇచ్చేస్తానని హరీశ్ శంకర్ చెప్పేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్‌లుగా నటించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే వదిలిన టీజర్, ట్రైలర్‌లు పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. అయితే గబ్బర్ సింగ్ మ్యాజిక్ మరోసారి రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. మరి ఈ సినిమా ‘తేరి’రీమేక్ తోనే వచ్చిందా?.. కథ, కథనాలు ఎలా ఉన్నాయి..? ఉగాది కానుకగా నేడు థియేటర్ లో రిలీజైన పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ కాంబో మూవీ మళ్లీ మ్యాజిక్ చేసిందా? లేదా? అనే విషయాలపై ఓ సారి లుక్కేదాం..

కథ:

నల్లమల అడవుల్లోని లింగయ్యగూడెంలో అనాథగా పెరిగిన చిన్నయ్య(పవన్ కళ్యాణ్​ ‌‌)ను ఆ ఊరి హెడ్ మాస్టర్ చంద్రశేఖర్ (కేఎస్ రవికుమార్) చేరదీస్తాడు. అతనికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అని పేరు మార్చి, గొప్పగా ఎదగాలని స్ఫూర్తిని కలగజేస్తాడు. కాలక్రమేణా చంద్రశేఖర్ రాజకీయాల్లోకి వెళ్లి ముఖ్యమంత్రి కాగా.. భగత్ సింగ్ ఐపీఎస్ అధికారిగా అడవిలో విధులు నిర్వహిస్తాడు. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో.. కొందరు దుండగులు ముఖ్యమంత్రిని చంపడానికి ప్రయత్నిస్తారు. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. తనని అంతవాడ్ని చేసిన మాస్టార్‌ని (సీఎం)ని అసలు ఆ ముఠా ఎందుకు చంపాలనుకుంది?.. తన గురువుపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి, రాష్ట్ర రాజకీయాల్లోని ఉగ్రవాద మూలాలను పెకిలించడానికి భగత్‌ ఎలా పోరాటం చేశాడు?..రేడియో జాకీగా పనిచేసే లీల (శ్రీలీల)కి, భగత్‌కి ఉన్న సంబంధం ఏంటి? ఈ ట్రాక్‌లోకి వచ్చిన శ్లోక (రాశీ ఖన్నా) ఎవరు? ఆమె భగత్ జీవితంలోకి ఎలా వచ్చింది?.. అవినీతిలో కూరుకుపోయిన ఓ రాజకీయ నేత ఆగడాలను భగత్ ఎలా అడ్డుకున్నాడు? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ:

పోలీస్ స్టోరీతోనే తెరకెక్కిన ఈ సినిమా (Ustaad Bhagat Singh) ‘తేరి’ రీమేక్ కాదని తేలిపోయింది. స్వతహాగా పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన హరీశ్ శంకర్ (Harish Shankar).. ఫ్యాన్స్ కు ‘వింటేజ్ పవన్’ను చూపించారని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ లుక్స్, డ్యాన్స్, ఫైట్స్, మేనరిజమ్, డైలాగ్స్ .. ఫ్యాన్స్‌కి విపరీతంగా నచ్చుతాయి. ‘గబ్బర్ సింగ్’లోని అంత్యాక్షరి తరహాలోనే ఇందులో ఇతర హీరోల పాటలకు పవన్ డాన్స్ చేసే ఎపిసోడ్ నవ్వును తెప్పిస్తోంది.ఇందులో పవన్ కళ్యాణ్ నిజ జీవిత రాజకీయ భావజాలం, పాత సినిమాల రిఫరెన్స్‌లనే హరీష్ ఎక్కువగా యూజ్ చేశారు. దేశభక్తి, హిందుత్వం, భారతీయ సంప్రదాయాల గొప్పతనం గురించి చెప్పే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కమర్షియల్ సినిమాలకు కథ కొత్తగా లేకపోయినా స్క్రీన్‌ప్లే గ్రిప్రింగ్‌గా ఉండాలి.ఈ విషయంలో మాత్రం హరీష్ శంకర్ ఇబ్బంది పడ్డారనే చెప్పొచ్చు. దేవి శ్రీ ప్రసాద్ నుంచి మ్యూజిక్, థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంతగా వర్కవుట్ కాలేదని తెలుస్తోంది. ‘దేఖ్ లేంగే సాలా’ పాట తప్ప మిగిలిన పాటలన్నీ అంతంత మాత్రంగానే అనిపించాయి.

ప్లస్ పాయింట్స్:

పవన్ కళ్యాణ్ నటన
సెకండాఫ్
యాక్షన్ కొరియోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

రొటీన్ స్టోరీ
పేలవమైన ఫస్టాఫ్
కొన్ని చోట్ల రొటీన్‌ బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మొత్తానికి పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ తో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పవర్ స్టార్, మాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ అందించగా.. నార్మల్ ప్రేక్షకులకు రొటీన్ గా అనిపిస్తుందని చెప్పొచ్చు.

రేటింగ్:

2.5/5

Read Also: అనుష్క పెళ్లి వార్తలు.. ప‌ర్స‌న‌ల్ టీం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>