పవన్ కళ్యాణ్ కు చేసిన సర్జరీ ఇదేనా?

కలం, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కు సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. శనివారం ఆయన అపోలో ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఆయనకు ఏ రకం సర్జరీ జరిగిందనే విషయాన్ని వెల్లడించలేదు. దీంతో పవన్ కళ్యాణ్ కు వచ్చిన ఆరోగ్య సమస్య ఏంటి? ఆయనకు సర్జరీ ఎందుకు చేశారని ఫ్యాన్స్ , జనసైనికులు ఆందోళన చెందారు. తాజాగా ఆయన సర్జరీ గురించి క్లారిటీ వచ్చింది.

పవన్ కళ్యాణ్ కు వైద్యులు సైనసైటిస్ సర్జరీ చేసినట్లు తెలుస్తోంది. ముక్కుకు సంబంధించిన ఈ శస్త్రచికిత్స (ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ)ను డాక్టర్లు విజయవంతంగా చేసినట్లు సమాచారం అందుతోంది . ఆయన్ని డిశ్చార్జ్ చేసి 10 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. భవిష్యత్ లో శ్వాస సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పవన్ కళ్యాణ్ కు వైద్యులు తెలిపారు. అభిమానులు ఎటువంటి ఆందోళన చెందొద్దని వైద్యులు అంటున్నారు. కాగా, పవన్ కళ్యాణ్ కు సర్జరీ చేశారని తెలియడంతో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>