Mobile Popup Ad
Mobile Popup Ad

ప‌వ‌న్ క‌ల్యాణ్‌ కీల‌క నిర్ణ‌యం.. ఆ జిల్లా క‌మిటీ ర‌ద్దు!

క‌లం, వెబ్ డెస్క్: జ‌న‌సేన (Janasena) అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. నెల్లూరు (Nellore) జిల్లా పార్టీ క‌మిటీని పూర్తిగా ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే ప‌వ‌న్ ప్ర‌కాశం జిల్లా క‌మిటీని ర‌ద్దు చేశారు. తాజాగా మరో జిల్లా క‌మిటీని ర‌ద్దు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా నాయ‌కుల్లో క్ర‌మ‌శిక్ష‌ణ లోపించింద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు. పార్టీ విధి విధానాల‌కు వ్య‌తిరేకంగా ప‌ని చేస్తున్నారంటూ కొంద‌రిపై పార్టీ మ‌ద్ద‌తుదారులు ఫిర్యాదు చేస్తున్నార‌ని వెల్ల‌డించారు. జ‌న‌సేన సిద్ధాంతాలు, ఆక‌ర్షితులై వారిని బ‌ల‌ప‌రిచామ‌ని, కానీ జిల్లా నాయ‌కుల తీరు అందుకు విరుద్ధంగా ఉంద‌ని కార్య‌క‌ర్త‌లు ఆవేద‌న చెందుతున్న‌ట్లు తెలిపారు.

ఈ నేప‌థ్యంలో ఉమ్మ‌డి నెల్లూరు జిల్లాలోని న‌గ‌ర‌, జిల్లా, మండ‌ల, గ్రామ క‌మిటీల‌న్నింటిని ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. క్రమ శిక్షణ లేని చోట వ్యవస్థను నిర్మించలేం అని పవన్​ వ్యాఖ్యానించారు. ఈ నిర్ణ‌యం త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని పేర్కొన్నారు. కొత్త క‌మిటీని ప్ర‌క‌టించే వ‌ర‌కు ఉమ్మ‌డి జిల్లా కార్య‌క‌లాపాలు కేంద్ర కార్యాల‌యం నుంచి ప‌ర్య‌వేక్షిస్తార‌ని ఆయ‌న చెప్పారు. పవన్​ కల్యాణ్​ వరుసగా రెండు జిల్లాల కమిటీలను రద్దు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్​ టాపిక్​ గా మారింది.

Read Also: డబుల్ ఇంజిన్ సర్కార్ విజయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి: చంద్రబాబు

Follow Us On: Sharechat

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>