కలం, వెబ్ డెస్క్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విజయాలపై రాష్ట్రంలో నిర్వహించే బహిరంగసభలను విజయవంతం చేయాలని కూటమిలోని రాజకీయ పక్ష నేతలకు సీఎం చంద్రబాబు (CM Chandrababu) సూచించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు, ప్రధానిగా మోదీ పాలన పగ్గాలు చేపట్టి 12 ఏళ్లయిన సందర్భంగా సభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆదివారం రాజధాని అమరావతిలో కూటమి పక్షాల నేతలతో సీఎం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జూన్ 9 వ తేదీన తిరుపతి వేదికగా జరగనున్న భారీ సభ గురించి వారితో చర్చించారు. ఆయా పార్టీల కార్యకర్తలందరినీ బహిరంగ సభకు ఆహ్వానించాలని.. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వారికి వివరించాలని సీఎం సూచించారు.
మూడు ప్రాంతాలలో నిర్వహించే సభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ వర్చువల్ మీటింగ్ కు టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు, జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ పి. హరిప్రసాద్, బీజేపీ నుంచి పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు.
Read Also: పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం.. ఆ జిల్లా కమిటీ రద్దు!
Follow Us On: Instagram

