తెలంగాణ మీ అయ్య జాగీరా : పవన్​ కళ్యాణ్

కలం, వెబ్​ డెస్క్ : తెలంగాణ నడిబొడ్డున జనసేన ఏర్పడింది అని.. ‘నన్ను బెదిరించడానికి తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా’ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ​తనను బెదిరిస్తున్న వారిపై విరుచుకుపడ్డారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తనకు తెలంగాణలో బెదిరింపుల కంటే ఆంధ్రాలోనే ఎక్కువ బెదిరింపులు అని చెప్పారు. ‘తెలంగాణకు నన్ను రానియ్యను అని అంటున్నారు. ఆంధ్రలో అయితే నా తల తీసేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఇదే నా అడ్రస్ దాడి చేయాలనుకుంటున్న వారు నా ఇంటికి రావచ్చు. నాకు భయం లేదు. బాంచన్ సారు కాళ్లు మొక్తా అనే ఉద్దేశం ఉంటే పార్టీ ఎందుకు పెడుతాం’ అంటూ పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>