ఆఖరి నిమిషంలో షాక్.. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం నిలిపివేత!

కలం, వెబ్ డెస్క్ : భారత అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన ‘విక్రమ్-1’ (Vikram-1) రాకెట్ ప్రయోగానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (SDSC-SHAR) నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టేందుకు ఇస్రో (ISRO) అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే, కౌంట్ డౌన్ ముగిసే సరిగ్గా చివరి నిమిషంలో రాకెట్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనితో అప్రమత్తమైన ఇస్రో, స్కైరూట్ ఏరోస్పేస్ బృందం ప్రయోగాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ, కౌంట్ డౌన్‌ను ఆపివేసింది.

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, ప్రైవేట్ రంగానికి చెందిన ‘స్కైరూట్ ఏరోస్పేస్’ (Skyroot Aerospace) సంస్థ ఈ విక్రమ్-1 రాకెట్‌ను అత్యాధునిక సాంకేతికతతో రూపొందించింది. ఈ ప్రయోగంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నప్పటికీ, సాంకేతిక లోపాల కారణంగా చివరి క్షణంలో అంతరాయం కలగడం గమనార్హం. ప్రస్తుతం ఇంజనీర్లు, సాంకేతిక నిపుణుల బృందం ఆ లోపాన్ని సరిదిద్దే పనిలో నిమగ్నమయ్యారు.

సమస్య గుర్తింపు.. కౌంట్ డౌన్ స్టార్ట్..

కొద్ది సేపటిక్రితం సాంకేతిక సమస్యతో ఆగిపోయిన విక్రమ్ 1 రాకెట్ ప్రయోగంలో సాంకేతిక సమస్యను గుర్తించారు. ఇంధన ప్రక్రియలో సమస్యను నిపుణులు గుర్తించారు. తదుపరి రాకెట్ ప్రయోగం 35 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభంకానున్నది. మధ్యాహ్నం 12గంటల 35 నిమిషాలకు ప్రయోగం ప్రారంభం కానున్నది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>