Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణ యువతలో నిరాశ నెలకొంది: సీపీఐ

కలం, నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర ప్రధాన డిమాండ్లు అయిన నీళ్లు, నిధులు, నియామకాలు వంటి అంశాలు నేటికీ పరిష్కారం కాకపోవడంతో తెలంగాణ యువతలో నిరాశ నెలకొందని నల్గొండ (Nalgonda) సీపీఐ (CPI) మాజీ జిల్లా కార్యదర్శి మల్లెపల్లి ఆదిరెడ్డి (Mallepalli Adireddy) పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీపీఐ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాను మల్లెపల్లి ఆదిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాధనకోసం పల్లె నుండి ఢిల్లీ వరకు ప్రజలందరూ ఉద్యమించి పాలకుల మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నట్లు గుర్తుచేశారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు సీపీఐ అనేక రకాలుగా ఉద్యమాలు చేపట్టారని, సీపీఐ నాయకులు, కార్యకర్తలు ఎంతోమంది అరెస్టై జైలుకు సైతం వెళ్లినట్లు తెలిపారు. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి లొడంగీ శ్రవణ్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి, పట్టణ కార్యదర్శి కర్ర సైదిరెడ్డి, పట్టణ నాయకులు బి. లెనిన్, ముండ్ల ముత్యాలు, మదర్, వెంకన్న యూసఫ్, బాసాని వెంకటయ్య, కోమటిరెడ్డి ప్రత్యూమ్నారెడ్డి, కె. నారాయణ, జి. విజయ, దాసరి విజయలక్ష్మి, దొండ కృష్ణయ్య, విష్ణు చారి, శివరాత్రి వీరయ్య, దుర్గయ్య, ఎల్లయ్య, ఎండీ చాంద్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>