Mobile Popup Ad
Mobile Popup Ad

అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా తెలంగాణ ఏర్పడింది: మంత్రి పొన్నం

కలం, మెదక్ బ్యూరో: ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తరువాత తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మూడు కార్యక్రమాలు తీసుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి ఇందిరమ్మ జీవిత భీమా పథకం తీసుకొచ్చిందని.. ప్రతి కుటుంబానికి అండగా ఉండేలా కార్యక్రమాన్ని అమలు చేశామని చెప్పారు. రాష్ట్రంలో 2 లక్షల పెన్షన్లు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగిందని తెలిపారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సకల జనులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ కేసులు, దాడులు, నష్టపోయిన వారిని గౌరవించి గుర్తించే కార్యక్రమం తీసుకుంటున్నామని అన్నారు. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో మొదటి దశలో ఒక్కో నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడం జరిగిందని చెప్పారు.

రెండవ దశలో నిన్న ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసిఫాబాద్ లో ప్రారంభించారని తెలిపారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని.. వ్యవసాయ అధికారులు, రైతులతో సమావేశం త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు. జిల్లాలో సంవత్సరానికి లక్షా 50 వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అవసరం కానీ ఇక్కడ 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుందని అన్నారు. అవసరమైన సన్న బియ్యం పండించేలా విత్తనాల నుండే రైతులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. ప్రతి రైతు ఆయిల్ ఫామ్ సాగు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని.. మన దగ్గర నర్మేట్టలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభమైందని చెప్పారు.

ప్రతి ఉద్యోగి, జర్నలిస్ట్ లు ప్రతి ఒక్కరు ఏకకాలంలో మొక్కలు నాటేలా గ్రామగ్రామానా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. తమ నియోజకవర్గంలో ప్లాంటేషన్ పై ఐదుగురు సభ్యులతో కమిటీ వేసుకున్నామని.. రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి కమిటీ వేసేలా ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. వర్షాకాలంలో నాటేందుకు 3 లక్షల ఈత చెట్లు సిద్ధంగా ఉన్నాయని.. కాలువల గట్లు, ప్రభుత్వ స్థలాల్లో నాటడానికి ప్లాన్ చేస్తున్నామని చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు సంఖ్య పెంచేలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటున్నామని వివరించారు. జూన్ 12న స్కూళ్లు ప్రారంభం అవుతున్నాయని..అదే రోజు వారికి అవసరమైన కిట్లు అందిస్తామని చెప్పారు. విధ్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్స్ నిర్మాణం అవుతున్నాయని తెలిపారు. బడిబాట కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. అలాగే రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు అరైవ్ అలైవ్ కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>