సౌర విద్యుత్తు ఉత్పత్తి మరింత పెంచుకుందాం: పట్నం మహేందర్ రెడ్డి

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: పరిశ్రమలు, గృహ ఉపయోగ వినియోగం కోసం అవసరమైన విద్యుత్తును సౌర శక్తి సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రభుత్వం అవసరమైన సహాయ సహకారాలు అందిస్తోందని.. ఇది మరింత పెంచాల్సిన అవసరం ఉందని శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి (Patnam Mahender Reddy) అన్నారు. ఎంపీ కుసుమ్ పథకం కింద మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని మూసాపేట మండలం పరిధిలోని పొన్నకల్ లో శుక్రవారం 4.8 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి కేంద్రాన్ని ఎమ్మెల్యే జీ. మధుసూదన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి రైతులతో కలిసి మాట్లాడుతూ.. ప్రతి ఇంటిలో సౌర విద్యుత్తు ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అవసరమైన సహకారం ఉంటుందని చెప్పారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. యువత, నిరుద్యోగులు సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రయత్నిస్తే తద్వారా వచ్చే ఈ విద్యుత్తును తమ ఇళ్లకు, వ్యవసాయానికే కాకుండా ప్రభుత్వం కూడా కొంటుందని చెప్పారు. తద్వారా వారు ఉపాధి పొందవచ్చు అని వివరించారు. తమ నియోజకవర్గంలో ఇలాంటి యూనిట్లు అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని ఆయన వివరించారు. స్థానిక సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, డైరెక్టర్ లు హిమదీప్ రెడ్డి ,రినీష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఆయనతో ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>