Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రతి కుటుంబానికి ఇల్లు.. కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: సుడా ఛైర్మన్

కలం, కరీంనగర్ బ్యూరో: ఇల్లు లేని ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ (Karimnagar) కార్పొరేషన్ కొత్తపల్లి 17వ డివిజన్ లో పూర్తయిన మొట్టమొదటి ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు పెంటి శ్రీలత శ్రీకాంత్ గృహ ప్రవేశంలో పాల్గొన్నారు. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మొదటి విడతలో మంజూరైన లబ్ధిదారులు పోను ఇంకా మిగిలిన వారికి ఇళ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్, చిలుక హన్మంత రెడ్డి, గున్నాల రమేష్, చింతల శ్రీనివాస్ రెడ్డి, జేరిపోతుల వాసు, యాస్వాడ రాజకుమార్, కొండం శ్రీనివాస్, సంగం మునీందర్, రాపర్తి రాజు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>