కలం, కరీంనగర్ బ్యూరో: ఆర్టీసీ సమ్మె కారణంగా రాష్ట్రవ్యాప్తంగా బస్సులు నిలిచిపోయాయి. ప్రభుత్వంతో చర్చలు విఫలమవడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి దిగారు. ఫలితంగా బస్సులు నిలిచిపోవడం, డిపోల వద్ద పోలీసుల బందోబస్తు, ప్రయాణికుల ఇబ్బందులు షరా మామూలయ్యాయి. ప్రయాణికులు గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తున్నది.
కరీంనగర్ జిల్లాలో పరిస్థితి ఇదే..
కరీంనగర్ రీజియన్‌లో కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ డిపోలున్నాయి. రీజియన్లో మొత్తం 8300 మంది సమ్మెలో ఉన్నారు. అందులో 3700 మంది కండక్టర్లు సమ్మెలో ఉండగా 63 మంది డ్యూటీలో ఉన్నారు. 2600 మంది డ్రైవర్లు సమ్మెలో ఉండగా 70 మంది బస్సులు నడుపుతున్నారు. 700 మంది మెకానిక్‌లకుగాను 40 మంది డ్యూటీలో కొనసాగుతున్నారు. 1036 మంది ఇతర సిబ్బందికిగాను 460 మంది విధులు నిర్వర్తిస్తున్నారు.
ప్రైవేటు వాహనాలే దిక్కు
సమ్మెతో రాష్ట్రవ్యాప్తంగా ఇబ్బందులు తప్పడం లేదు. సమ్మె ప్రారంభం నుంచి ప్రభుత్వ యంత్రాంగం పోలీసుల సహాయంతో బస్సులను నడిపించేందుకు ప్రయత్నించినప్పటికీ కొన్ని చోట్ల నిరసనలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం తాత్కాలిక డ్రైవర్, కండక్టర్లను నియమించాలని నిర్ణయించింది. టీజీఎస్ ఆర్టీసీలో టెంపరరీ డ్రైవర్లుగా పనిచేసే వారు హెవీ లైసెన్సు కలిగి ఉండి 18 నెలల అనుభవం ఉండాలని, ఆసక్తి ఉన్న వారు ఒరిజినల్ ఆధార్ కార్డు, రెండు పాసు పోర్టు సైజ్ ఫొటోలు తీసుకుని సంబంధిత డిపో కార్యాలయాల్లో సంప్రదించాలని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు. టెంపరరీ కండక్టర్ గా పనిచేయాలనున్న వారు ఒరిజినల్ ఎస్సెస్సీ మెమో, ఒరిజినల్ ఆధార్ కార్డు, రెండు పాస్ పోర్టు సైజ్ ఫొటోలు ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించారు. ఆయా డిపోలకు సంబంధించిన ఫోన్ నెంబర్ల ద్వారా సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. డ్రైవర్ డ్యూటీ చేసే వారికి రోజుకు రూ.1000, కండక్టర్ అయితే రూ.800 చొప్పున చెల్లిస్తామని సైతం ప్రకటించారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో తాత్కాలిక డ్రైవర్, కండక్లర్టను నియమించుకునే పనిలో ఆర్టీసీ అధికారులు నిమగ్నమైనట్టు తెలుస్తోంది.
ఆ డ్రైవర్లతో ప్రమాదం తప్పదా?
రాష్ట్రంలోని అన్ని డిపోల్లో ఉంటుందని అందరూ భావిస్తున్నారు. అద్దెపై నడుస్తున్న ఎలక్ట్రిక్, సాధారణ బస్సులను నడిపిస్తున్నారు. టెంపరరీ డ్రైవర్లను నియమించినట్లయితే బస్సుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా కరీంనగర్ లో ప్రైవేట్ డ్రైవర్‌తో బస్సు ప్రయాణం ప్రమాదకారంగా మారడం ఆందోళన రేకెత్తిస్తోంది. టెంపరరీ డ్రైవర్లను నియమించినట్లయితే బస్సుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం గతంలో పనిచేసిన కార్మికుల పక్షాన నిలుస్తుందా? మొండి వైఖరి అవలంభిస్తుందా? వేచి చూడాలి.

