Mobile Popup Ad
Mobile Popup Ad

కాళేశ్వరంపై కోర్ట్ తీర్పు.. మంత్రి ఉత్తమ్ చర్చలు

కలం, వెబ్ డెస్క్: కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) రిపోర్ట్ ఆధారంగా కేసీఆర్, హరీశ్ రావుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్ట్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే, నీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ పై సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వితో చర్చలు జరిపారు. హైకోర్టు తీర్పును అభిషేక్ సింఘ్వికి వివరించిన మంత్రి ఉత్తమ్.. రేపు జరిగే కేబినెట్ భేటీకి ముందే తీర్పు కాపీ పరిశీలన చేసి సలహా ఇవ్వాలని కోరారు.

సుప్రీంకోర్టుకి వెళ్లబోతున్న తెలంగాణ ప్రభుత్వం..

తెలంగాణ హైకోర్ట్ తీర్పుని సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు, న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతోంది. హైకోర్ట్ తీర్పు తదుపరి విచారణకు ప్రతిబంధకంగా మారే అవకాశం ఉందని సుప్రీంకోర్టులో వాదించే అవకాశం ఉంది. రేపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>