కలం, వెబ్ డెస్క్ : మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు (Parvathipuram Counting) కేంద్రం వద్ద ఊహించని పరిణామం ఎదురైంది. ఉదయం 9 గంటలు దాటుతున్నా స్ట్రాంగ్ రూమ్ తాళాల ఆచూకీ లభించకపోవడంతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంలో తీవ్ర జాప్యం నెలకొంది. తాళాలు దొరక్కపోవడంతో లెక్కింపు కేంద్రం వద్ద సర్వత్రా ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
ఈ అనూహ్య పరిస్థితిపై స్పందించిన ఎన్నికల అధికారులు వెంటనే ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించారు. పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో అత్యవసరంగా కీలక చర్చలు జరిపారు. అందరి సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తాళాలను పగలగొట్టేందుకు సర్వసమ్మతి వ్యక్తమైంది. ఉమ్మడి అంగీకారం లభించడంతో అధికారులు, సిబ్బంది తాళాలు పగలగొట్టే పనులను ప్రారంభించారు. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే మరికొద్ది నిమిషాలలో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

