కెప్టెన్సీ కోసం.. కేకేఆర్‌ వైపు హార్దిక్‌!

కలం, స్పోర్ట్స్ :  ఐపీఎల్‌ 2027కు ముందు హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya) జట్టు మారే అవకాశాలు పెరిగాయి. అతడిని ట్రేడ్‌ చేసుకునేందుకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మళ్లీ ఆసక్తి చూపుతోంది. రహానే రిటైర్మెంట్‌తో ఏర్పడిన కెప్టెన్సీ ఖాళీని హార్దిక్‌తో భర్తీ చేయాలని భావిస్తోంది. మరోవైపు హార్దిక్‌ను వదులుకునేందుకు ముంబై ఇండియన్స్‌ కూడా సిద్ధమవుతోంది. నవంబర్‌ 15 రిటెన్షన్‌ గడువులోగా ఈ డీల్‌ను పూర్తి చేయాలని చూస్తోంది. అయితే ఆటగాళ్ల మార్పిడే ప్రధాన అడ్డంకిగా మారింది.

నరైన్‌, వరుణ్‌, రింకూలను వదులుకునేందుకు కేకేఆర్‌ సిద్ధంగా లేదు. హార్దిక్‌ కోసం హర్షిత్‌ రాణా, అంగ్‌క్రిష్‌ రఘువంశీలను ముంబై కోరుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా మంచి ఫామ్‌లో ఉన్న రఘువంశీని వదులుకునేందుకు కేకేఆర్‌ వెనుకాడుతోంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ కూడా హార్దిక్‌పై ఆసక్తి చూపినా.. కెప్టెన్సీ ఇచ్చే అవకాశం లేకపోవడం అడ్డంకిగా మారింది. దీంతో కేకేఆర్‌ వైపే హార్దిక్‌ మొగ్గు చూపే అవకాశాలపై చర్చ జరుగుతోంది. అయితే ఇరు జట్ల మధ్య ఒప్పందం ఇంకా ఖరారు కాలేదు. వచ్చే వారం చర్చలు కొనసాగనున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>