కలం, వెబ్ డెస్క్ : కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన (TRS)ను ప్రకటించిన వేళ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే పార్టీ పెట్టిన క్రమంలో ఆమె అధికార పార్టీకి సలహాలు, సూచనలు ఇస్తే బాగుండేదని.. కానీ పార్టీ పెట్టిన మొదటి రోజే ఆమె విమర్శలకు దిగారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని ‘కర్కోటకుడు’ అంటూ ఆమె విమర్శలు చేయడం సరైంది కాదని చెప్పారు. పార్టీ ప్రారంభోత్సవంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కవిత అధికార దాహానికి అద్దం పడుతోందని విమర్శించారు.
గత పదేళ్లలో అధికారంలో ఉన్నప్పుడు ఆమెకు ప్రజలు గుర్తుకు రాలేదా? అని మంత్రి ప్రశ్నించారు. కల్వకుంట్ల ఇంటి నుంచి బయటికి పంపిస్తే.. బయటికి వచ్చి అధికారం కోసం కవిత పార్టీ పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారని.. ఏ పార్టీని కూడా నమ్మె స్థితిలో ప్రజలు లేరని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam) స్పష్టం చేశారు.
Read Also: కవిత దోపిడీపై వివరణ ఇవ్వాలి: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్
Follow Us On : WhatsApp

