ఏసీబీ వలలో ఎస్‌డిఓ: బయటపడ్డ కోట్ల అక్రమాస్తులు

కలం, వెబ్ డెస్క్ : ఒకప్పుడు కేవలం 9300 రూపాయల జీతంతో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ఇంజినీర్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఒక అధికారి, ఇప్పుడు కోట్ల రూపాయల ఆస్తులకు అధిపతిగా మారడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒడిశాలోని గంజాం జిల్లా దహా ఇరిగేషన్ సబ్ డివిజన్ ఎస్డీఓ (Odisha SDO)గా విధులు నిర్వర్తిస్తున్న పాంచు బెహెరా నివాసాలు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు నిర్వహించిన సోదాల్లో కళ్లు చెదిరే సంపద బయటపడింది.

ఈ తనిఖీల్లో సుమారు 18.90 లక్షల రూపాయల నగదుతో పాటు, భారీ యంత్రసామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 57 లక్షల విలువైన కాంక్రీట్ మిక్సర్ మెషిన్, 37 లక్షల విలువైన జేసీబీ ఉండటం గమనార్హం. అంతేకాకుండా బెర్హంపూర్‌లో ఒక బహుళ అంతస్తుల భవనం, ఐదు ఖరీదైన ప్లాట్లు, సుమారు 380 గ్రాముల బంగారం, నాలుగు వాహనాలను అధికారులు గుర్తించారు. 2011లో అతి తక్కువ జీతంతో ఉద్యోగంలో చేరిన ఈ అధికారి (Odisha SDO), ఇంత స్వల్ప కాలంలోనే ఇన్ని కోట్ల విలువైన ఆస్తులను ఎలా కూడబెట్టారనే కోణంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

Read Also:  ఏది ఏమైనా ప్రభుత్వ ప్రాధాన్యత విద్య, వైద్యం: CM రేవంత్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>