Mobile Popup Ad
Mobile Popup Ad

పంజాగుట్ట మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా (Panjagutta Constable) విధులు నిర్వహిస్తున్న మహిళ శిరీష ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. భర్త తనకు పట్టించుకోవడం లేదని తీవ్ర మనస్తాపానికి గురై సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఏడాది క్రితం కానిస్టేబుల్ స్వప్నిల్ తో శిరీషకు వివాహం జరిగింది. వీరిద్దరూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం శిరీష ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదయింది. వీరిద్దరి మధ్య అంతర్గత కలహాల వలనే ఇద్దరు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Read Also: వీగిన మహిళా బిల్లు.. పొలిటికల్ గేమ్ షురూ

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>