కలం, వెబ్ డెస్క్: ఏపీ వ్యాప్తంగా 6 లక్షల ఉచిత సూర్యఘర్ కనెక్షన్లు మంజూరయ్యాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravikumar) అన్నారు. విద్యుత్ రంగంలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో మంత్రి పర్యటించారు. సీఎం ముందస్తు పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులతో పాటు ఆయన పాల్గొన్నారు. అనంతరం మంత్రి గొట్టిపాటి అభయాంజనేయ స్వామిని దర్శించుకున్నారు. సీఎం పేరు మీద ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం నేమకల్లులో పీఎం సూర్యఘర్ పథకాన్ని మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. రాయదుర్గంలో తొలివిడతలో 2400 ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు సూర్యఘర్ అమలైంది.
Read Also: హర్మూజ్ ఓపెన్.. ట్రంప్ రియాక్షన్ ఇదే!
Follow Us On: WhatsApp

