బాసర ట్రిపుల్‌ ఐటీలో నీటి కష్టాలు.. ఏబీవీపీ ఆగ్రహం!

కలం, నిర్మల్: బాసర ట్రిపుల్‌ ఐటీ (Basara IIIT) లో నెలకొన్న నీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఏబీవీపీ ఇందూర్‌ విభాగ్‌ కన్వీనర్‌ కైరి శశిందర్‌ డిమాండ్‌ చేశారు. క్యాంపస్‌లో నీటి సమస్యను పరిష్కరించకుండా సెలవులు పొడిగించడం విద్యార్థుల విద్యాసంవత్సరానికి నష్టం కలిగిస్తుందని విమర్శించారు.

బోరుబావులు, నీటి పంపులకు వెంటనే మరమ్మతులు చేపట్టి, అవసరమైతే కొత్త బోరుబావులు ఏర్పాటు చేయాలని కోరారు. సెలవుల పొడిగింపుతో నష్టపోయిన విద్యాసమయాన్ని భర్తీ చేసేందుకు వీసీ స్పష్టమైన విద్యా క్యాలెండర్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల సమస్యలపై వీసీ స్పందించి, పరిష్కారానికి నిర్దిష్ట గడువు వెల్లడించాలని పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించకపోతే ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>