కలం, దిలావర్‌పూర్: బాలల హక్కుల పరిరక్షణ(Child Rights Protection), లైంగిక నేరాల నిరోధం, బాల్యవివాహాల నివారణతో పాటు పిల్లలకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ నిఖిత అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం దిలావర్‌పూర్ (Dilawarpur) మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ‘సురక్షిత్ బచ్పన్ అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా బాలలపై జరిగే లైంగిక వేధింపులను అరికట్టడం, బాలికకు భద్రత కల్పించడం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. బాలలపై లైంగిక నేరాల నియంత్రణకు పోక్సో చట్టం–2012 కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రవీందర్, న్యాయవాది షేర్ నరేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

