చండూరులో ఘనంగా పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి జయంతి వేడుకలు

కలం, మునుగోడు : మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు, దివంగత నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి (Palvai Govardhan) 90వ జయంతి వేడుకలు శుక్రవారం చండూరు పట్టణ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కుమార్తె పాల్వాయి స్రవంతిరెడ్డితో కలిసి మునుగోడు మండల నాయకులు గోవర్ధన్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ సాధన కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చేసిన పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజల కోసం ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కొన్రెడ్డి మధు, మాజీ జెడ్పీటీసీ అన్నేపర్తి శేఖర్, మాజీ ఎంపీపీ తోకల వెంకన్న, కొత్తపాటి, సతీష్, ఇరిగి రామన్న, రావిరాల నగేష్, మారగోని అంజయ్య గౌడ్, మేకల శ్రీనివాస్ రెడ్డి, పాల్వాయి వెంకట్ రెడ్డి, జిట్టగోని మల్లేష్ యాదవ్, తేలుకుంట్ల చంద్రశేఖర్, సురిగి లింగస్వామి, మార్త మోహన్ రెడ్డి, తేలుకుంట్ల జానయ్య, దుబ్బ రాజశేఖర్, మేకల రాకేష్ రెడ్డి, బోయపల్లి లింగయ్య, చింటు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>