Mobile Popup Ad
Mobile Popup Ad

పాక్ టేబుల్ టెన్నిస్ ఆటగాళ్లకు షాక్!

కలం, స్పోర్ట్స్: ఆసియా గేమ్స్‌లో దేశం తరఫున ఆడాలనుకునే పాకిస్తాన్ టేబుల్ టెన్నిస్ (Pakistan Table Tennis) ఆటగాళ్లకు అక్కడి ఫెడరేషన్ (PTTF) ఊహించని షాక్ ఇచ్చింది. జపాన్‌లో జరగబోయే ఈ మెగా ఈవెంట్‌కు ఎంపికయ్యే క్రీడాకారులు తమ విమాన టికెట్లతోపాటు రోజువారీ ఖర్చుల కోసం (రోజుకు 50 డాలర్లు) సొంతంగా డబ్బులు సర్దుబాటు చేసుకోవాలని స్పష్టం చేసింది. లాహోర్‌లో జరుగుతున్న జాతీయ ట్రయల్స్ సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ప్రస్తుతం జరుగుతున్న ట్రయల్స్‌కు కూడా ఎలాంటి అలవెన్సులు ఇవ్వడం లేదని అధికారులు చెప్పడంతో ఆటగాళ్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే పాకిస్తాన్ స్పోర్ట్స్ బోర్డ్ (PSB) నుండి తమకు ఎలాంటి నిధులు రావడం లేదని, ఫెడరేషన్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ఓ సీనియర్ అధికారి వారికి వివరించారు. బోర్డు సహాయం లేకపోయినా ట్రయల్స్ నిర్వహించడాన్ని ఆటగాళ్లు అభినందించాలని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటివరకు ఆసియా గేమ్స్‌లో పాకిస్తాన్ ఒక్క టేబుల్ టెన్నిస్ (Pakistan Table Tennis) పతకం కూడా గెలవలేదు. చైనా, భారత్, సౌత్ కొరియా వంటి దేశాలు ఈ క్రీడలో బలంగా దూసుకుపోతున్న తరుణంలో, పాక్ ఆటగాళ్లపై ఈ ఆర్థిక భారం పడటం వారిని తీవ్ర అనిశ్చితిలోకి నెట్టింది.

Read Also: కామన్వెల్త్ గేమ్స్‌లో నీరజ్‌ చోప్రాకు స్థానం.. కానీ..

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>