కలం, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్, వేల్స్ వేదికగా జరిగే ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ (Womens T20 World Cup) కోసం పాకిస్తాన్ జట్టును ప్రకటించింది. ఈ టీంలో ఐదుగురు తొలిసారిగా T20 ప్రపంచ కప్ ఆడనున్నారు. ఫాతిమా సనా ను కెప్టెన్ గా వ్యవహరించనుంది. జింబాబ్వేతో ఇటీవల జరిగిన ODI సిరీస్‌లో రెండు సెంచరీలు చేసిన గుల్ ఫిరోజాకు ఈ టోర్నీలో అవకాశం దక్కింది. అనుభవజ్ఞురాలైన వికెట్ కీపర్-బ్యాటర్ మునీబా అలీ, బ్యాటర్ ఆయేషా జాఫర్ ఒపెనింగ్ బ్యాటింగ్ చేయనున్నారు.
నటాలియా పర్వైజ్, ఇరం జావేద్, ఆలియా రియాజ్, సైరా జబీన్ లతో మిడిల్ ఆర్డర్ బలంగా ఉంది. పాకిస్తాన్ ప్రధాన బలంగా ఉన్న బౌలింగ్ యూనిట్ లో స్పిన్నర్లు సాదియా ఇక్బాల్, నష్రా సంధు, టూబా హసన్, రమీన్ షమీమ్ ఉన్నారు. ఫాతిమా, డయానా బేగ్, తస్మియా రుబాబ్ పేస్ బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేయనున్నారు. కాగా, టీ20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ తన తొలి మ్యాచ్ భారత్ తో ఆడనుంది.
పాక్ జట్టు వివరాలు..
ఫాతిమా సనా (కెప్టెన్), గుల్ ఫిరోజా, అయేషా జఫర్, ఇరమ్ జావేద్, ఐమాన్ ఫాతిమా, అలియా రియాజ్, నటాలియా పర్వేజ్, సైరా జబీన్, మునీబా అలీ, టూబా హసన్, రమీన్ షమీమ్, సాదియా ఇక్బాల్, నష్రా సంధు, డయానా బేగ్, తస్మియా రుబాబ్.

