కలం, ఖమ్మం బ్యూరో: పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతుండటంతో భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా బూర్గంపాడు గుమ్మూరు వద్ద పోలీసులు జరిపిన తనిఖీల్లో రేషన్ బియ్యం పట్టుబడింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బొల్లం వెంకటేశ్వర్లు గుమ్మూరు, ఎన్‌పీ రెడ్డిపాలెం గ్రామాల్లోని లబ్ధిదారుల నుండి తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేశాడు. వాటిని ఎక్కువ ధరకు విక్రయించేందుకు సీతారాంపురానికి తరలిస్తున్నాడు. శుక్రవారం గుమ్మూరు వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో ఈ అక్రమ రవాణా రట్టు అయింది.
అక్రమంగా తరలిస్తున్న 5 క్వింటాళ్ల బియ్యంతో పాటు రవాణాకు ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై బొల్లం వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.

