కామారెడ్డిలో నకిలీ నోట్ల ముఠా అరెస్ట్

కలం, నిజామాబాద్ బ్యూరో : కామారెడ్డి జిల్లా పిట్లం మండలం ధర్మారం టోల్ గేట్ వద్ద నకిలీ నోట్ల (Fake Currency) ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను బాన్సువాడ డీఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ విఠల్ రెడ్డి వివరాలు వెల్లడించారు.

హైదరాబాద్ నుండి మహారాష్ట్రకు వెళ్తుండగా పిట్లం మండల పరిధిలో పెట్రోల్ బంక్ వద్దకు కారులో వచ్చిన ముగ్గురు యువకులు పెట్రోల్ పోసుకుని నాలుగు 500 రూపాయల నోట్లు ఇచ్చారు. అవి తీసుకున్నాక తరవాత అని నకిలీ నోట్లుగా పెట్రోల్ బంక్ సిబ్బంది గుర్తించారు. వెంటనే పోలీసులకు సంచారం ఇచ్చారు. అప్రమత్తమైన పోలీసులు సీసీ కెమెరాల ద్వారా కారును గుర్తించారు.

ధర్మారం టోల్ గేట్ వద్ద చెల్లించిన టోల్ రుసుము బిల్ ఆధారంగా నిందితులను గుర్తించారు. ముగ్గురు మహారాష్ట్రకు చెందిన యువకులు రాహుల్, భీమ్ శంకర్, ప్రతీక్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో ముదస్సర్ హుస్సేన్ అనే వ్యక్తి వద్ద లక్ష ఇచ్చి రూ.2 లక్షలు నకిలీ నోట్లు తీసుకు వచ్చినట్లు ముదస్సర్ హుస్సేన్ పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. ముగ్గురి వద్ద 91 వేల నకిలీ నోట్లు, స్విఫ్ట్ డిజైర్ కారు,3 సెల్ ఫోన్లు సీజ్ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>