కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ (Paddy Procurement) వేగంగా జరుగుతోందని పౌరసరఫరాల శాఖ పేర్కొంది. రబీ సీజన్‌కు సంబంధించి ఇప్పటివరకు 10.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విజయవంతంగా కొనుగోలు చేసి, లక్ష మంది రైతుల ఖాతాల్లో రూ. 500.20 కోట్లను విడుదల చేసినట్లు పేర్కొంది. భారీగా వస్తున్న ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు మొత్తం 8,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించింది. వీటిలో 4,350 ప్యాక్స్ కేంద్రాలు, 3,563 ఐకేపీ, ఇతర సంస్థల ద్వారా 662 కేంద్రాలు నడుస్తున్నాయని తెలిపింది.
నిరంతరం తరలింపు ప్రక్రియ..
రైతుల నుంచి ఇప్పటివరకు 4.50 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం, 5.50 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యాన్ని సేకరించినట్లు పౌరసరఫరాల శాఖ వివరించింది. కేంద్రాల వద్ద ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా, కొన్న ధాన్యాన్ని అధికారులు ఎప్పటికప్పుడు వేగంగా తరలిస్తున్నారని వివరించింది.. ఎలాంటి ఆలస్యం లేకుండా ధాన్యాన్ని కొనుగోలు (Paddy Procurement) కేంద్రాల నుంచి నేరుగా మిల్లులకు పంపుతున్నారని.. దీని వలన కొత్త ధాన్యాన్ని తీసుకోవడానికి కేంద్రాలు ఖాళీగా, ఎప్పుడూ సిద్ధంగా ఉంటున్నాయని ప్రకటించింది.
Read Also: తెలంగాణ కాంగ్రెస్ కి బీసీ లీడర్ల ప్రెజర్..!
Follow Us On: X(Twitter)

