ఉస్మానియా యూనివర్సిటీలో ఘోర ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ (Hyderabad) లోని ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం (OU Road Accident) చోటుచేసుకుంది. టిప్పర్ స్కూటీని ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఓయూ పరిధిలోని ఇఫ్లూ వద్ద అటుగా వెళ్తున్న స్కూటీని ఓ టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీపై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

కాగా, ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్ డ్రైవర్ అక్కడినుంచి పరారయ్యాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>