Mobile Popup Ad
Mobile Popup Ad

మైక్రో ఫైనాన్స్ వేధింపులతో యువకుడి మృతి

కలం, నాగార్జునసాగర్ : ఆన్లైన్ మైక్రో ఫైనాన్స్ (Online Microfinance) సంస్థల వేధింపులు.. ఒక యువకుడి ప్రాణాన్ని బలిగొన్న ఘటన నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) పరిధిలోని పాల్తి తండా గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రమేష్ (38) కొద్ది రోజుల క్రితం ఆన్లైన్ మైక్రో ఫైనాన్స్ సంస్థ ద్వారా రుణం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రుణ చెల్లింపుల విషయంలో సంస్థ ప్రతినిధులు నిరంతరం ఫోన్ కాల్స్ చేస్తూ తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపించారు. ఈ నిరంతర వేధింపుల కారణంగా రమేష్ మానసికంగా తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. సోమవారం కూడా చెల్లింపుల కోసం వరుస కాల్స్ రావడంతో ఒక్కసారిగా అస్వస్థతకు గురై గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

ఇదే సమయంలో మైక్రో ఫైనాన్స్ మోసాలపై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. రామావత్ బాలాజీ నాయక్, మధు నాయక్ అనే వ్యక్తులు మైక్రో ఫైనాన్స్ పేరుతో నెలకు 10 నుంచి 18 శాతం వడ్డీ ఆశ చూపించి సుమారు రూ. 50 నుండి రూ. 68 కోట్ల వరకు మోసం చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై ఆగ్రహించిన మృతుని బంధువులు విజయపురి నార్త్ పోలీస్ స్టేషన్ ఎదుట మృతదేహంతో ధర్నా నిర్వహించారు. దీంతో కొంతసేపు వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను శాంతింపజేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>