కొత్త బ్రిడ్జిపై యువ‌కుల అత్యుత్సాహం.. వృద్ధుడు ఉక్కిరి బిక్కిరి!

క‌లం, వెబ్‌డెస్క్: మూసారాంబాగ్ హైలెవెల్ బ్రిడ్జి (Moosarambagh Bridge)పై జ‌రిగిన ఓ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇందులో కొంద‌రు యువ‌కులు ఓ వృద్ధుడిని తీవ్ర వేధింపుల‌కు గురి చేస్తున్న‌ట్లుగా ఉంది. ఇటీవల ఆగస్టు 31న సీఎం రేవంత్ రెడ్డి ఈ కొత్త బ్రిడ్జిని అధికారికంగా ప్రారంభించారు.

ఈ బ్రిడ్జి (Moosarambagh Bridge) ప్రారంభోత్సవం త‌ర్వాత అక్క‌డికి భారీగా యువ‌త చేరుకున్నారు. సీఎం చేతుల‌మీదుగా ప్రారంభోత్స‌వం త‌ర్వాత‌ మొద‌టిసారి ఓ వృద్ధుడు ఆ బ్రిడ్జిపైకి త‌న ఎక్స్ఎల్ బండిపై వ‌చ్చాడు. అంతే.. అక్క‌డే ఉన్న అల్ల‌రి మూక‌లు వృద్ధుడిని చుట్టుముట్టారు.

వృద్ధుడి బండిని ఆపి ఆయ‌న‌ చుట్టూ చేరి అరుస్తూ, గోల చేస్తూ నానా హంగామా చేశారు. బండిపైకి ఎక్కి వృద్ధుడిని భ‌య‌భ్రాంతుల‌కు చేశారు. ఒకానొక స‌మ‌యంలో వృద్ధుడి ముఖంలో చాలా భ‌యం క‌నిపించింది. అస‌లు అక్క‌డ ఏం జ‌రుగుతుందో, వాళ్లు ఎందుకు అలా ప్ర‌వ‌ర్తిస్తున్నారో ఏమీ అర్థంకాని ప‌రిస్థితిలో ఆయ‌న ఉండిపోయాడు. త‌ర్వాత అక్క‌డే ఉన్న కొంద‌రు వ్య‌క్తులు జోక్యం చేసుకొని పెద్దాయ‌న‌ను వెళ్ల‌నివ్వండి అంటూ చెప్ప‌డంతో ఆ యువ‌కులు ప‌క్క‌కు త‌ప్పుకున్నారు. త‌ర్వాత కూడా ఆయ‌న వెళ్తున్నంత సేపు బండి వెంట ప‌రుగెత్తుతూ అరుస్తూనే ఉన్నారు.

ఈ వీడియో సోష‌ల్ మీడియాలో చాలా వైర‌ల్‌గా మారింది. యువ‌కుల ప్ర‌వ‌ర్త‌న ప‌ట్ల నెటిజ‌న్లు తీవ్ర‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఒక‌ పెద్దాయ‌నతో ప్ర‌వ‌ర్తించేది ఇలాగేనా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. వీడియో ఆధారంగా వృద్ధుడిని వేధించిన వారిపై పోలీసులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నెటిజ‌న్లు కోరుతున్నారు.

Also Read : మినిస్టర్ క్వార్టర్స్‌లోకి కాంగ్రెస్ బాస్.. టీపీసీసీ చీఫ్ సీక్రెట్ మూవ్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>