కల్లూరు రైస్ మిల్లులో అధికారుల ఆకస్మిక తనిఖీ

కలం, కుంటాల: కుంటాల మండలం కల్లూరు (Kallur) గ్రామంలోని శ్రీ ఆంజనేయ రైస్ మిల్లు (Sri Anjaneya Rice Mill) లో రెవెన్యూ అధికారులు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైస్ మిల్లులో ధాన్యం నిల్వల్లో భారీ వ్యత్యాసాన్ని గుర్తించారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం సదరు రైస్ మిల్లులో 4,440 మెట్రిక్ టన్నులు ధాన్యం నిల్వ ఉండాల్సి ఉండగా, తనిఖీల సమయంలో 720 మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. దీంతో 3,720 మెట్రిక్ టన్నులు ధాన్యం కొరత ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు.

నిల్వల్లో వ్యత్యాసాన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు తక్షణమే రైస్ మిల్లును, అలాగే మిల్లులో ఉన్న లారీలోని ధాన్యాన్ని సీజ్ చేశారు. రైస్ మిల్లర్ అందుబాటులో లేని కారణంగా నిబంధనల ప్రకారం శనివారం పంచనామా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. వరి ధాన్యం విషయంలో అక్రమాలు, అవకతవకలకు పాల్పడే వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో తహసీల్దార్ కమల్ సింగ్‌ రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>