Mobile Popup Ad
Mobile Popup Ad

దరఖాస్తులపై ఇక క్షేత్రస్థాయి పరిశీలన

కలం/ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో సంక్షేమ పథకాల్లో నకిలీ దరఖాస్తుదారులకు చెక్ పెట్టేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించబోతున్నారు. మీ సేవ నుంచి సర్టిఫికెట్ ఇవ్వాలంటే గ్రౌండ్ లెవల్లో వెరిఫికేషన్ చేస్తారు. జిల్లాలోనీ మీసేవ సంస్థల పనితీరును మరింత సమర్థవంతంగా తీర్చి దిద్దడానికి అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. దరఖాస్తు దారుల నివాసానికి వెళ్లి, వివరాలను యాప్ లో నమోదు చేయబోతున్నారు. జియో ట్యాగింగ్ తో లైవ్ ఫొటోలను అప్ లోడ్ చేసి.. నకిలీ దరఖాస్తులకు చెక్ పెట్టబోతున్నట్టు అధికారులు వెల్లడిస్తున్నారు.

ఫిజికల్ ఫైళ్ల అవసరం లేకుండా.. డిజిటల్ విధానంలోనే వెరిఫికేషన్ పూర్తి చేస్తారు అధికారులు. కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లాంటి పథకాల దుర్వినియోగాన్ని నివారిస్తామని అధికారులు వెల్లడించారు. యాప్ ద్వారా సేకరించిన సమాచారం నేరుగా మీ సేవ పోర్టల్ కు అనుసంధానమై డేటా తక్షణమే అప్డేట్ అవుతుంది. మీ సేవ సర్టిఫికెట్ వెరిఫికేషన్ మొబైల్ యాప్ వినియోగంపై శనివారం కలెక్టర్ ఆఫీసులో అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యాప్ డౌన్ లోడ్ విధానం, లాగిన్ ప్రక్రియ, ఫీల్డ్ వెరిఫికేషన్ నమోదు, ఫొటో అప్ లోడ్, రిపోర్ట్ సబ్మిట్ తదితర అంశాలపై నిపుణులు అవగాహన కల్పించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>